మట్టి పనులు చేసేందుకు గ్రామస్తుల విముకత

మట్టి పనులు చేసేందుకు గ్రామస్తుల విముకత

  • బయట కూలి పనులకు వెళితే ఎక్కువ ఆదాయం
  • నందిగామ, క్యాసారం గ్రామసభలలో కూలీల విన్నపం 
 

పటాన్ చెరు (సంగారెడ్డి ):కేంద్ర ప్రభుత్వ పథకం బిబి జి రామ్ జి ద్వారా జలసిరి కార్యక్రమంలో భాగంగా పటాన్ చెరు మండలం నందిగామ, క్యాసరం గ్రామాలలో స్థానిక సర్పంచులు ఎల్లగొని విక్రంగౌడ్, సంగీత గోవర్ధన్ రెడ్డిల ఆధ్వర్యంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభ కార్యక్రమానికి పటాన్ చెరు మండల స్పెషల్ ఆఫీసర్ ఐనీష్, ఎంపీడీఓ యాదగిరి, ఎంపీఓ హరిశంకర్ గౌడ్ లు హాజరయ్యారు. బిబి జి రంజీ పథకం ద్వారా జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంటికి ఒక ఇంకుడు గుంత, పంటకు ఒక పంట కుంట, ఊరికి ఒక ఊరకుంట ద్వారా పనులు చేయుటకు రెండు గ్రామాలకు సంబంధించి రెండు ఎస్ హెచ్ జీ గ్రూపులకు వివో గ్రేడ్ ద్వారా పంట కుంట చేయుటకు గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామసభలు గ్రామస్తులందరూ ఉపాధి హామీ ద్వారా వచ్చే మట్టి పనులకు గాను రోజువారి కూలీ 308 రూపాయలు మాకు సరిపోవని చెప్పారు. గ్రామంలో ఉన్న కూలీలు చుట్టుపక్కల పరిశ్రమలలో, ఇతర పనులకు వెళ్తున్నారు అని తెలిపారు. రోజువారి కూలీ సుమారు 700 నుంచి 1000 రూపాయల ఆదాయం వస్తుందని గ్రామస్తులు తెలిపారు. దీనితో ఉపాధి హామీకి సంబంధించిన మట్టి పనులను చేసేందుకు గ్రామంలోని కూలీలు ఆసక్తి చూపలేదు. రెండు గ్రామాలకు సంబంధించి గ్రామసభలో తెలిపిన వివరాలను తీర్మానం చేసి పై అధికారులకు సమాచారం తెలుపుతానమని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా వన మహోత్సవంలో భాగంగా నందిగామ, క్యాసారం గ్రామాలలో గ్రామస్తులకు వారు మొక్కలను అందజేశారు. ఈ సమావేశంలో నందిగామ ఉపసర్పంచ్ గోరేమియా, క్యాసారం ఉపసర్పంచ్ వెంకటేష్, నందిగామ పంచాయతీ కార్యదర్శి రాజేందర్ పాటిల్, క్యాసారం పంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డి, ఏపిఎం మాధవిలత, టిఏ శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఎస్ హెచ్ జి మహిళా సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 
Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత