ఇండస్ట్రియల్ పార్క్‌పై ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం
పరిగి(వికారాబాద్ ): వికారాబాద్ జిల్లా: దోమ మండలంలోని కొండాయపల్లి గ్రామంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ కలెక్టర్ వెంకటచారి, ఆర్డీవో వాసు చంద్ర, తహసీల్దార్ రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ నర్సింహులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్.ఐ) తదితర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను గ్రామస్థులకు వివరించి, వారి అభిప్రాయాలు, సూచనలు, సందేహాలను తెలుసుకున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించగా, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 34
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
