ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు..
భక్తులతో కిటకిటలాడిన శ్రీ పాంచజన్యం క్షేత్రం
కొత్తగూడెం గురు పౌర్ణమి సందర్భంగా రామవరం గ్రామంలోని శ్రీ పాంచజన్యం క్షేత్రంలో ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా వారి మందిరంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీమాన్ సద్గురు సౌమిత్రి శ్రీధరాచార్యుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు ఉదయం 5 గంటలకు కాగడ హారతితో ప్రారంభమయ్యాయి. అనంతరం పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక అలంకారం, అర్చన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీ దత్తాత్రేయ మాలా మంత్ర సహిత సహస్రనామ హోమం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైదికంగా నిర్వహించారు.మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, గురుపూజలో పాల్గొన్న భక్తులు సద్గురువుల ఆశీర్వాదాలు పొందారు.ఈ సందర్భంగా నిర్వాహకులు గురు పౌర్ణమి మహోత్సవాలను విజయవంతం చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలియజేసి, సాయిబాబా వారి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
Views: 27
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
