గ్రామసభలో ఓటరు జాబితాపై కీలక తీర్మానాలు

పరిగి(వికారాబాద్ ): ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా పరిగి మండలంలోని గడిసింగాపూర్ గ్రామంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ ఓటరు జాబితాను పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు కీలక తీర్మానాలు చేశారు. గ్రామంలో మరణించిన వారి పేర్లు, రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా 233వ బూత్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసినందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి, బీఎల్‌వో మొగులయ్యను, 232వ బూత్ బీఎల్‌వో నరేష్‌ను, బూత్ సూపర్‌వైజర్ రమేష్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. వెంకట్ రాములు, గ్రామ సర్పంచ్ అలవేలు నరసింహ, ఉపసర్పంచ్ మైపాల్, వార్డు సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు. 
Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత