ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయండి

పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి..

ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయండి

రామచంద్రాపురం (సంగారెడ్డి) : అర్హులైన ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ వివరాలు నమోదు చేయించుకునేలా మరింత అవగాహన కల్పించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు సూచించారు. బుధవారం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ లో బిఆర్ఎస్ పార్టీ భారతీ నగర్, రామచంద్రపురం డివిజన్ల బూత్ లెవెల్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని అన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు అద్భుతంగా పనిచేస్తున్నప్పటికిని.. నమోదు శాతం ఆశించినంతగా లేదని తెలిపారు. ప్రక్రియ ముగియడానికి ఐదు రోజుల సమయం మాత్రమే ఉందని.. ఎస్ఐఆర్ లో పాల్గొనని ఓటర్లను స్వయంగాకలుసుకొని.. వివరాలు అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఓటు అత్యంత కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, పృథ్వీరాజ్, ఐలేష్, ప్రమోద్ గౌడ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత