ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
నల్లబెల్లి / వరంగల్ : పవిత్ర గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు బుధవారం మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో అత్యంత భక్తిశ్రద్థలతో ఘనంగా జరిగాయి.ఆలయ పూజారులు కొత్తపల్లి జీవన్ , శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా పుష్ప, దీపాలంకరణలతో ఆలయం మొత్తం దేదీప్యమానంగా వెలుగులీనింది. కాగడ హారతితో ప్రారంభమై 108 అష్టోత్తర శతకలత అభిషేకములు, హారతి, పుష్పాభిషేకం, సామూహిక సత్యవ్రతాలను నిర్వహించారు. వేద పండితుల మంత్రోశ్ఛరణల మధ్య అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండలకేంద్రంలోని మురళి పోటో స్టూడియో యజమాని పడాల మురళి కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగిన అన్నదాన కార్యక్రమంలో మండల కేంద్రంతో పాటు సమీప గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు.పూజలు నిర్వహించిన అనంతరం పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు సాయిబాబాని దర్శించుకోవడంతో సాయినామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.ఈ కార్యక్రమంలో భక్తులు గట్టు సుధాకర్, కారుకూరి ప్రసాద్, నాగవెల్లి శ్రీధర్,సుదర్శన్,పాండవుల మనోజ్ పాల్గొన్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
