లోతట్టు,వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల పరిశీలన.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించిన ఎంపీడీఓ,ఎస్ఐ
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు,వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం ఓదెల ఎంపీడీఓ అనిల్ రెడ్డి,పొత్కపల్లి ఎస్ఐ సనత్ రెడ్డి ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గ్రామంలోని రోడ్లు, కల్వర్టు లను,వర్షపు నీరు నిలిచిపోయిన లోతట్టు ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వర్షపు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట్ల ప్రజలు,వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున కల్వర్టులు,వరద నీరు పారే రహదారులను దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు.ప్రమాదకర ప్రాంతాలకు,నీటి ప్రవాహాల వద్దకు చిన్న పిల్లలను వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అధిక వర్షాలకు అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకి వెళ్లవద్దని తెలిపారు.అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే స్థానిక అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు స్పష్టం చేశారు.ఈ పర్యటనలో అధికారులతో పాటు స్థానిక సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.
Views: 91
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
