ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి

ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి

  • ఆయిల్‌ పామ్ సాగుతో దీర్ఘకాలికంగా లాభాలు
  • జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ): వరి సాగుతో పాటు ఆరుతడి పంటలు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుదవారం చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామంలోని రైతు వేదికలో విత్తనమేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌నీనో వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా ఆరుతడి పంటలను కూడా సాగు చేయాలని అన్నారు. కంది, శనగ, పెసర వంటి పప్పుధాన్యాలతో పాటు నువ్వులు, వేరుశెనగ వంటి నూనె గింజల పంటలకు కూడా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తోందని తెలిపారు. ఆయిల్‌ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయాన్ని అందించే పంట అని అన్నారు. ఈ పంట సాగుకు ప్రభుత్వం వివిధ రకాలుగా 4 సంవత్సరాల పాటు సబ్సిడీ అందిస్తోందని, అలాగే ఆయిల్‌ పామ్ మంజూరు, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాల కల్పనను కూడా త్వరితగతిన చేపట్టనున్నట్లు వివరించారు. రైతులకు పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం 75 శాతం వరకు ప్రోత్సాహక సహాయం అందిస్తోందని తెలిపారు. సాగులో ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్ లోని టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-425-6605కు ఫోన్ చేసి కూడా సాగుకు సంబంధించిన పూర్తి సమాచారం, సలహాలు పొందవచ్చని తెలిపారు. అనంతరం రైతులకు కూరగాయల విత్తనాల సంచులను పంపిణీ చేసి, విత్తన మేళాను పరిశీలించారు.  ఆయిల్ పామ్ సాగులో వర్షాలు ఎక్కువగా పడినా, ఎండ తీవ్రంగా ఉన్నా పెద్దగా నష్టపోయే పరిస్థితి ఉండదని రైతు తెలిపారు. మార్కెటింగ్ సౌకర్యం కూడా చాలా బాగుందని కోత కోసి ఫ్యాక్టరీకి పంపిస్తే వెంటనే తూకం పూర్తవుతుందన్నారు. మూడు రోజుల్లోనే డబ్బు నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల అధికారులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Views: 286

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత