రాష్ట్రంలో విద్య వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి కృషి వెడ్మ బొజ్జు పటేల్

రాష్ట్రంలో విద్య వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి కృషి వెడ్మ బొజ్జు పటేల్

39 లక్షలతో ఇంద్రవెల్లి కేజీబివీ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బోజ్జు 

 
 

ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి మండలంలోని కేజీబీవి పాఠశాలలో 39 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సారధ్యంలో విద్య వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం  ప్రత్యేక చొరవ చూపుతోంది అని, విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని గుర్తించి, ఉన్నత చదువులు చదువుతూ గొప్ప స్థాయికి చేరుకోవాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక బోధన అందిస్తూ, సమాజంలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో కాంట్రాక్టర్ త్వరతిగతిన నాణ్యతతో పనులు పూర్తి చేయాలనీ సూచించారు. పాఠశాల సిబ్బంది పనుల నాణ్యతను నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి పెరుగు బసంతోత్సవం
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
14 మందికి క్వార్టర్ల కేటాయింపు 
ఘనంగా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
‘క్యాతన్ పల్లిలో’ కమిషనర్ విధులకు ఆటంకం 
విద్యార్థుల అభ్యాస లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
భక్తులతో కిటకిటలాడిన సాయిఆలయాలు
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత