గ్రామ ప్రజల ఆరోగ్యమే గ్రామ అభివృద్ధికి పునాది.
- జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్.
- చెంగేశ్‌పూర్ గ్రామంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
తాండూరు (వికారాబాద్ జిల్లా) గ్రామ ప్రజల ఆరోగ్యమే గ్రామ అభివృద్ధికి పునాది అని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. గురువారం బీసీ సంఘం ఆధ్వర్యంలో న్యూ లోటస్ హాస్పిటల్ తాండూర్ వారి సౌజన్యంతో చెంగేశ్‌పూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు ఉచిత మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు, రక్త నమూనాల సేకరణ కూడా నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ,“గ్రామ ప్రజల ఆరోగ్యమే గ్రామ అభివృద్ధికి పునాది” అన్నారు.గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ గౌడ్ బీసీ సంఘం ప్రతినిధులకు, న్యూ లోటస్ హాస్పిటల్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డ్ సభ్యులు, న్యూ లోటస్ హాస్పిటల్ అధినేత మాణిక్యం, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, మీడియా ఇన్‌చార్జ్ బసవరాజ్, బీసీ సంఘం నాయకులు రాము ముదిరాజ్, పరమేష్, పాండు గౌడ్, దుబాయ్ వెంకట్, తాండ్ర నరేష్, మంబాపూర్ మంజుల, వినయ్, కిరణ్, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Views: 52
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
