కృష్ణమ్మ పరవళ్ళు ..జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద..

కృష్ణమ్మ పరవళ్ళు ..జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద..

  • అర్ధరాత్రి దాటిన తర్వాత పది గేట్లు ఎత్తివేత
  • అన్నదాతల కళ్ళలో ఆనందం

గద్వాల : జూరాలకు వరద తీవ్రత పెరిగిన నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో అధికారులు పది గేట్లు ఎత్తివేశారు. గత వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో నారాయణపురం మీదుగా 30 వేల క్యూసెక్కుల జలాలు జూరాలకు చేరుతూ వచ్చాయి.కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో బుధవారం 1,35,620 క్యూసెక్కులను దిగువకు విడుదల చేయడం,బీమా నుంచి 60 వేల క్యూసెక్కుల జలాలు వస్తూ ఉండడంతో దాదాపుగా రెండు లక్షల క్యూసెక్కుల నీరు మక్తల్ నియోజకవర్గం తంగడి వద్ద ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా నదికి వచ్చి చేరుతున్నాయి. దీనితోపాటు జూరాల ఎగువ భాగంలోను గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద తీవ్రత మరింతగా పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టు కు సంబంధించి ముందస్తు జాగ్రత్తగా గురువారం తెల్లవారుజామున పది గేట్లు ఎత్తివేసి 44,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ మధ్యాహ్నం వరద తీవ్రత పెరగునున్న నేపథ్యంలో జూరాల వద్ద గేట్లను ఎత్తివేసే అవకాశం ఉంది. బీమాకు 1300 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ 492, నెట్టెంపాడు 1044 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఆర్డీఎస్ కు నీటిని విడుదల చేయాల్సి ఉంది.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాలి
ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి సంతోష్
చక్రియాల గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవాలు