‘సర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి’
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మందమర్రి, (మంచిర్యాల) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ గడువు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం మందమర్రి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన భూభారతి,రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. సాదా బైనమా,భూభారతి,రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులతో సరిచూసి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్ పన్ను బకాయిలను త్వరగా వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
