మందమర్రిలో ఇంటర్నల్ ఆడిట్ పై సమీక్ష
మందమర్రి, (మంచిర్యాల) : ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ అధ్యక్షతన ఇంటర్నల్ ఆడిట్ పై సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్నల్ ఆడిట్ నివేదికలు, ప్రభుత్వ ఆడిట్ గమనింపులు, భూ సేకరణ, స్థల సంబంధిత అంశాలతో పాటు మైనింగ్ స్టోర్స్ నిర్వహణపై అధికారులతో మాట్లాడారు. పనుల్లో మరింత పారదర్శకత,ఆడిట్ సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు పరిష్కరించు కోవాలని జిఎం అధికారులకు సూచించారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
