స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ
శివంపేట, మెదక్: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శివంపేట మండలం కొత్తపేట శివారులోని గ్లాండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు కలిసి నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల విభాగాధిపతి ఆలేటి రాజేశ్వరి మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవసరమైన స్టేషనరీని అందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు కళాశాల సిబ్బంది రాజేశ్వరి, ప్రకాశమనీ, కల్పన, దివ్య, నాగరాజు, ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Aug 2026 17:43:36
లింగాల గణపురం (జనగాం)కుందారం: కుందారం గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా సేవలందించిన పాలమాకుల ఐలయ్య ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థీవ...
