ఆలయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు

ఆలయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కె ఆర్   నాగరాజు

హన్మకొండ :వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఆలయలఅభివృద్ధికి కృషి చేస్తున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం కడిపికొండలోని శ్రీ చంద్రమౌళిశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆలయంలో జరుగుతున్న మూలవిరాట్ విగ్రహ జీర్ణోదరణ పూజలో పాల్గొన్నారు.ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారికి శాలువాలతో సన్మానించి స్వాగతం పలికారు.ఈ శివాలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా,గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు.ఆలయ అభివృద్ధి కోసం భక్తుల సౌకర్యాలు పెంచడానికి కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ ప్రెసిడెంట్ కర్ర హరీష్ రెడ్డి, 44వ డివిజన్ ప్రెసిడెంట్ సదానందం యాదవ్,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి మాజీ కార్పొరేటర్ బస్కె శ్రీలేఖ, మాజీ డివిజన్ ప్రెసిడెంట్ సట్ల సదానందం,సోషల్ మీడియా కోఆర్డినేటర్ సతీష్,యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణయ్,మండల పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మంద రమేష్,సీనియర్ నాయకు లు కోటేశ్వర్,ఎడ్ల రాజమల్ల రెడ్డి, మహిళ నాయకులు నీలం రజిని, ప్రశాంతి,కాయితే కవిత, డివిజన్ సీనియర్ నాయకులు కార్యకర్తలు,అర్చకులు తదితరులు పాల్గొన్నారు,  
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News