రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం
శివంపేట, : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందించే పీఎం-రాహత్ (PM-RAHAT) పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి సూచించారు. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులు ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా ఏడు రోజుల పాటు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్స పొందవచ్చని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని, బాధితులకు సకాలంలో తక్షణ వైద్య సహాయం అందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ కోరారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Nov 2026 18:24:25
చౌటకూర్ :- ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు చెందిన రావెప్ విద్యార్థులు, సంగారెడ్డి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చౌటకూర్...
