అంబేద్కర్ కళాభవనానికి రూ.1.90 కోట్ల మంజూరు

మిడ్జిల్ : మిడ్జిల్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.90 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి కి అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి సభ్యులుమండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూమిడ్జిల్ మండల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఈ కళాభవనాన్ని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగావిద్యాసామాజికసాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. మిడ్జిల్ మండలానికి ఇది ఒక ఆదర్శ విజ్ఞాన కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజ అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు కళాభవనం ద్వారా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికిఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డికి మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.డి. గౌస్అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి అధ్యక్షుడు శారద వెంకటయ్యబాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డిమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌస్,అంబేద్కర్ విజ్ఞాన సేవా సమితి అధ్యక్షులు బి దేవయ్య గౌరవ అధ్యక్షులు బి బాలయ్య విగ్రహ స్థాపన కమిటీ అధ్యక్షులు శారద వెంకటయ్య ఉపాధ్యక్షులు బి బుచ్చయ్య సీనియర్ నాయకులు బి దానియేల్బి రాములుమాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ సంపత్ కుమార్బర్గల ఆదాంమిడ్జిల్ ఉప సర్పంచ్ మమత మన్యం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బంగారు, ఆయా గ్రామాల సర్పంచులు, దళిత సంఘాల ,నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.

 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ