గోదావరి వరద ఉధృతితో ఏజెన్సీలో నిలిచిన రాకపోకలు

గోదావరి వరద ఉధృతితో ఏజెన్సీలో నిలిచిన రాకపోకలు

  • చర్ల వెంకటాపురం ప్రధాన రహదారిపైకి చేరిన వరద నీరు
  • భద్రాచలం వద్ద నేడు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం

చర్ల,(భద్రాద్రి కొత్తగూడెం ): భద్రాచలం వద్ద గోదావరి నది క్రమంగా పెరుగుతున్న వరద ఉధృతితో ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎనుగుల వాగు ఉప్పొంగడంతో పాటు గోదావరి వరద నీరు ప్రధాన రహదారి పైకి చేరడంతో చర్ల వెంకటాపురం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి, దీనితో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని కఠినంగా ఆదేశించారు, రెవెన్యూ ,పోలీస్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు
Views: 216

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి