పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి

WhatsApp Image 2026-03-01 at 5.42.19 PM

 

మరిపెడ  : తాతల కాలం నుంచి వస్తున్న వారసత్వ భూమిపై కొంత మంది కన్నేసి అమాయక రైతులను రెచ్చగొడుతూ తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని మరిపెడ మండలం నీలికుర్తి గ్రామానికి చెందిన బాధిత రిటైర్డ్ అధికారి సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తన వ్యవసాయ క్షేత్రం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీలికుర్తి రెవెన్యూ పరిధిలోని భజన తండా సమీపంలో తాతల నాటి నుంచి సుమారు 8.15ఎకరాలు భూమి ఉందని, విద్యుత్ శాఖలో ఉద్యోగం రిత్యా తాను వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కాగా గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తన అధికార బలంతో తన వ్యవసాయ క్షేత్రం పైన ఉన్న రైతులను రెచ్చగొట్టి గత పదేళ్లుగా తనపై దౌర్జన్యం చేస్తున్నారని, తన భూమి నుంచి రోడ్డు వేయించి అన్యాయంగా సుమారు ఎకరం భూమిపై కన్నేశారని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకుని భూమి కొలతలు వేసి తన భూమిని కాపాడాలని కోరారు.

Views: 65

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News