ప్రభుత్వం మౌనం వీడి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలి

ప్రభుత్వం స్పందించకపోతే కారంమెతుకులే దిక్కు: దామగట్ల కుమార్

ప్రభుత్వం మౌనం వీడి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలి

ప్రభుత్వం మౌనం వీడి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల.కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కారంమెతుకులే దిక్కవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. పండుగ రోజున కూడా ఉద్యోగులు తమ నిరసనలు కొనసాగించారు. మౌనదీక్ష చేపట్టి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం తింటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దామగట్ల కుమార్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ షరతులు లేకుండా క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, భవిష్యత్తుపై ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఉద్యోగుల కుటుంబాలు మానసిక ఆవేదనకు గురవుతున్నాయని తెలిపారు. ప్రజారోగ్య సేవల్లో ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని, ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు, వైద్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News