కొంతనపల్లిలో చెత్త బుట్టల పంపిణీ

పరిశుభ్రతే లక్ష్యంగా గ్రామ ప్రజలకు చెత్త బుట్టల అందజేత

కొంతనపల్లిలో చెత్త బుట్టల పంపిణీ

శివంపేట, అక్టోబర్ 22 (విజన్ ఆంధ్ర): మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతనపల్లి గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ చింతల విజయ వెంకటరామిరెడ్డి గ్రామ ప్రజలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. పరిశుభ్రమైన గ్రామంతోనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధిక, ఉపసర్పంచ్ బొల్లారం కుమార్, వార్డు సభ్యులు, గ్రామ సిబ్బంది, సారా శంకర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News