ఎల్‌నినో ప్రభావం నేపథ్యం లో నీటి వినియోగంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి.
బాన్సువాడ ఆర్డీఓ అడ్లా రవీందర్ రెడ్డి......
బాన్సువాడ, : ఎల్‌నినో ప్రభావం కారణంగా నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్న నేపథ్యం లో, నిజాంసాగర్, మంజీరా జలాల తో పాటు చెరువుల నీటి పై ఆధారపడి సాగు చేసే రైతులు యాసంగి సీజన్ లో నీటి వినియోగం అధికం గా ఉండే పంటల ను సాగు చేయవద్దని బాన్సువాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) అడ్లా రవీందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశం లో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యం లో నీటి లభ్యత తగ్గే పరిస్థితుల ను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపిక లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లో అనధికారికంగా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని వినియోగిస్తే, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ కనెక్షన్లను తొలగి స్తారని తెలిపారు. నీటి వనరుల ను బాధ్యతా యుతంగా వినియోగిస్తూ, అధికారుల సూచనలను రైతులు తప్పని సరిగా పాటించాలని కోరారు. ఈ సందర్భంగా బాన్సువాడ, బిచ్కుంద సహాయ వ్యవసాయ సంచాలకు లు మాట్లాడుతూ. యాసంగి సీజన్‌లో బోరు బావుల సౌకర్యం ఉన్న రైతులు కూడా నీటి లభ్యత ను దృష్టిలో ఉంచుకుని ఒకటి లేదా రెండు తడుల తో పండించ గలిగే ఆరుతడి పంటలైన జొన్న, శనగ, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి పంటల ను సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటి తో పండే పంటల కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థ వంతంగా వినియోగించు కోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం లో బాన్సువాడ, బిచ్కుంద సహాయ వ్యవసాయ సంచాలకుల తో పాటు విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


