రైతులు అప్రమత్తంగా ఉండాలి : డిప్యూటీ కలెక్టర్
మేడిపల్లి / భీమారం : మేడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హరిణి ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హరిణి మాట్లాడుతూ పలు రాష్ట్రాలలో ఎల్నినో సంభవించే అవకాశం ఉండడం వలన వర్షాలు తగ్గి పంటలకు సరిపడా నీళ్ల కొరత ఏర్పడవచ్చు అని రైతులు పంటలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఉన్నత అధికారులు సూచనల మేరకు రైతులు తక్కువ నీటితో పండించే కందులు, పెసర్లు, అనుములు వంటి పంటలు వేసుకుంటే తక్కువ నీటితోనే పంట చేతికి వచ్చి ఎక్కువ లాభాలు పొందవచ్చునని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు షాహిద్ అలీ, శ్రీనివాస్, ఏఈఓ లు గంగా లక్ష్మి, సృజన, రైతులు నర్సారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, తిరుపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


