తొలిసారి మేయర్ హోదాలో జెండా ఎగరవేసిన కొలగాని శ్రీనివాస్

వికసిత భారత్ 2047 లక్ష్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి

తొలిసారి మేయర్ హోదాలో జెండా ఎగరవేసిన కొలగాని శ్రీనివాస్

కరీంనగర్, :కరీంనగర్ నగర మేయర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నగర ప్రథమ పౌరుడి గా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. శనివారం ఉదయం 7 గంటలకు మేయర్ క్యాంపు కార్యాలయంలో, 8.30 గంటలకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. జాతీయ గీతం అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ మేయర్ గా తొలిసారి జాతీయ పతాకం ఎగురవేయడం గర్వకారణం. సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని కరీంనగర్ ను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్ గా తీర్చిద్దాలన్న లక్ష్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. పరిశుభ్రత, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమంలో కరీంనగర్ ను ఆదర్శ నగరంగా నిలుపుతాం" అని తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పరేడ్ మైదానంలో జరిగిన అధికారిక వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఉప మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జాతీయ జెండా ఆవిష్కరణ.. దేశభక్తి గీతాలతో కోలాహలం జాతీయ జెండా ఆవిష్కరణ.. దేశభక్తి గీతాలతో కోలాహలం
బిజినపల్లి,  :దేశ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బిజినపల్లి లోని ఆల్ సెన్స్ మోడల్ హై స్కూల్ లో అత్యంత ఘనంగా...
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు
బెల్లంపల్లి లో ఘనంగా  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
2వ వార్డు అంగన్వాడిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
 సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వేళ బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
యరుగండ్లపల్లిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.