బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
సిపిఐ పాదయాత్ర ప్రచార జాత ముగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి
సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్) : కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని మాజీ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ పాదయాత్ర ప్రచార జాత ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చార వెంకటరెడ్డి మాట్లాడుతూ సిపిఐ పార్టీకి పోరాటాలు కొత్త కాదని హుస్నాబాద్ గడ్డపై స్వాతంత్రం రాకముందే సిపిఐ పోరాటాలు చేసిందని ప్రభాకర్ రావు లాంటి నాయకుల పోరాటాలను గుర్తు చేశారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటినుండి డీజిల్ పెట్రోల్ గ్యాస్ సిలిండర్ల ధరలు నిత్యవసర ధరలు పెంచిందని దేశ ప్రజలపై అధిక భారం మోపిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బిజెపి మోడీ ప్రభుత్వాన్ని గద్దధించాలని ప్రజలను కోరారు. ప్రజానాట్యం మండలి అరుణోదయ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మల్లె చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కళాకారుల బృందం సిపిఐ నాయకులు ప్రజా వ్యతిరేక విధానాలపై భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తెలంగాణకు స్వతంత్రం రావాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిందని అన్నారు. వికసిత్ భారత్, మంకీ బాత్ లాంటి కల్లోబోల్లి మాటలతో ప్రజలను మోడీ మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వంలోకి రాకముందు 60 లక్షల అప్పు ఉన్న దేశాన్ని రెండు లక్షల కోట్లకు పైగా అప్పుల్లోకి నెట్టారని అన్నారు.బిజెపి నాయకులు కార్పోరేట్ వ్యక్తులకు పనిచేస్తున్నారని అంబానీ, నవీన్ విట్టల్, జిందాలాంటి వాళ్లకు సహకరిస్తున్నారని తెలిపారు. ప్రశ్నించే గొంతులను పండగ దక్కుతున్నారని జైల్లో పెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రామ్ మందిర్ పేరుతో మతాల మధ్య చిచ్చు పెట్టి దొంగల్లా వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో బిగ్ మానేరు గౌరవెల్లి ప్రాజెక్టులకు నిధులు తీసుకువచ్చానని తెలిపారు. నియోజకవర్గంలో సిపిఐ ప్రచార జాత కార్యక్రమానికి సహకరించిన నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పపెండింగ్ పనులు పూర్తి చేయాలని, ఇండ్లు లేని నిరుపేదలకు పుండ్లు నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు కలవేని శంకర్, నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ,సీపీఐ సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి గడిపే మల్లేష్, సర్పంచ్ కోయ్యడ సృజన కుమార్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కనుకుంట్ల శంకర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జనగాం రాజ్ కుమార్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, సీపీఐ కోహెడ మండలం కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్, ప్రజా నాట్య మండలి కళాకారులు పల్లె నర్సింహా,అశోక్, వినోద్, శ్రీకాంత్ లతో పాటు పార్టీ కార్యకర్తలు ప్రజలు పాదయాత్ర లో పాల్గొన్నారు
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
14 Aug 2026 17:43:36
లింగాల గణపురం (జనగాం)కుందారం: కుందారం గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా సేవలందించిన పాలమాకుల ఐలయ్య ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థీవ...
