బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు:

జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు:

కరీంనగర్, : కరీంనగర్ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం రోజు పంద్రాగస్టు స్వాతంత్ర్య వేడుకలను కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలు, 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ.. ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభ్యున్నతి కోసం, భవిష్యత్తు తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఐక్యంగా ఉండి ముందుకు కొనసాగాలని తెలిపారు. . 'వికసిత్ భారత్' లక్ష్యంగా దేశం ముందుకెళ్తోందని, ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ జి. రమేష్, మాజీ ఎమ్మెల్యే శోభక్క, మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు , 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మీడియా సెల్ కన్వీనర్ కటకం లోకేశ్, ఉప్పర పల్లి శ్రీనివాస్ , కార్పొరేటర్లు, బిజెపి రాష్ట్ర ,జిల్లా నాయకులు కార్యకర్త లు ,వివిధ మోర్చా బాధ్యులు, మండల, నగర జోన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

యరుగండ్లపల్లిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. యరుగండ్లపల్లిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
స్వాతంత్ర్య వేడుకల్లో ప్రతిభకు ఘన సత్కారం దేశభక్తి స్ఫూర్తితో.. విద్యార్థుల భవిష్యత్తుకు బాట ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం.. సంతోష్ యాదవ్ ప్రత్యేక చొరవ  
తొలిసారి మేయర్ హోదాలో జెండా ఎగరవేసిన కొలగాని శ్రీనివాస్
పాపన్నపేట చేనేత సహకార సంఘం వద్ద
జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వెంకటేశ్వర నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు:
ఉట్నూర్‌లో ఆత్రం వంశీయుల చారిత్రక కోటపై జాతీయ జెండా ఆవిష్కరణ