కార్మికుల జీతాలు తగ్గిస్తే మున్సిపాలిటీ స్తంభిస్తుంది

  బి ఆర్ ఎస్  మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.

కార్మికుల జీతాలు తగ్గిస్తే మున్సిపాలిటీ స్తంభిస్తుంది


భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ లో పనిచేస్తున్న 152 మంది కార్మికులకు పాత పద్ధతిలోనే పూర్తి వేతనాలు చెల్లించాలి, తక్షణమే సమస్యను పరిష్కరించాలి. భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న 152 మంది కార్మికుల వేతనాలను తగ్గించే చర్యలను బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి  తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జీవో నెం.69 ప్రకారం వేతనాలు తగ్గించాలని హైదరాబాద్ నుంచి ఆదేశాలు వచ్చాయని, అయితే కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 152 మంది కార్మికులకు ఎలాంటి కోతలు లేకుండా పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని ఏకగ్రీవంగా తీర్మానం  కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ, ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయాల్సిందేనని మున్సిపల్ కమిషనర్ చెప్పడం సమంజసం కాదన్నారు.  ప్రజలకు సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను తగ్గించడం ద్వారా వారి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక్కో కార్మికుడి వేతనం నుండి సుమారు రూ.1,000 నుంచి రూ.4,900 వరకు కోత పడే పరిస్థితి ఉందని, ఇది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ బిల్లులు, ఇంటి ఖర్చులు పెరుగుతున్న సమయంలో వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గించడం సరియైన పద్ధతి కాదు అని అన్నారు. 14వ తేదీ వచ్చిన ఇప్పటి వరకు కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం దారుణమని,నెలంతా పనిచేసిన కార్మికులు తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి,అవసరమైతే కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానానికి ర్యాటిఫికేషన్ తీసుకుని 152 మంది కార్మికులకు పాత పద్ధతిలోనే పూర్తి వేతనాలు చెల్లించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు చేస్తున్న న్యాయమైన ఆందోళనకు తమ సంపూర్ణ సంఘీభావం ఉంటుందని తెలిపారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మున్సిపాలిటీ లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వంటి కీలక సేవలు ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. కార్మికులే కదా అని తక్కువ అంచనా వేయొద్దు.వారి సమస్యను పరిష్కరించకపోతే మేమంతా కార్మికుల వెనుక నిలబడతామని,అవసరమైతే భూపాలపల్లి మున్సిపాలిటీని స్తంభింపజేసే విధంగా కార్యక్రమాలను ఉదృత్తం చేస్తామని స్పష్టం చేశారు. రేపు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో, ఈరోజు సాయంత్రంలోగా కార్మికుల వేతనాల సమస్యను పరిష్కరించి,పాత పద్ధతిలో పూర్తి జీతాలు చెల్లించేలా ప్రభుత్వం మరియు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News