జాతీయ జెండా ఆవిష్కరణ.. దేశభక్తి గీతాలతో కోలాహలం

80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఆల్ సెన్స్ మోడల్ హై స్కూల్ బిజినపల్లి

జాతీయ జెండా ఆవిష్కరణ.. దేశభక్తి గీతాలతో కోలాహలం

బిజినపల్లి,  :దేశ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బిజినపల్లి లోని ఆల్ సెన్స్ మోడల్ హై స్కూల్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలతో కార్యక్రమానికి ప్రత్యేక శోభను తెచ్చారు. భారతదేశ పటాన్ని రంగవల్లికతో అలంకరించి, త్రివర్ణ జెండాలతో పాఠశాల మొత్తం అందంగా ముస్తాబు చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసు కుంటూ, యువత దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఉపాధ్యాయులు సూచించారు. క్రమశిక్షణతో చదివి దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.కార్యక్రమం చివరలో అందరికీ మిఠాయిలు పంచారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు సమిష్టిగా ఫోటోలు దిగారు. దేశభక్తి నినాదాలతో పాఠశాల ప్రాంగణం మార్మోగింది.
 
 
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News