ముద్దాపూర్ లో విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ

చిన్న కిష్టాపూర్ ఇందిరమ్మ ఇళ్లు భూమి పూజ

ముద్దాపూర్ లో విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ

గజ్వేల్/సిద్దిపేట   :సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ముందుగా మండలంలోని చిన్న కిష్టాపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కొండపాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం రూపుదిద్దుకుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే, ముద్దాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ తూము శ్రీకాంత్ రెడ్డి తన స్వంత నిధులతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ డ్రెస్సులను, మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా బహుకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తూము శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ చిన్న ప్రయత్నం చేశానని అన్నారు. సర్పంచ్ చేసిన ఈ ఉదార స్వభావాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంతోష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
 
 
Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News