పెద్దమల్లారెడ్డి సెక్రటరీకి ఛార్జ్ మెమో 

-ఎట్టకేలకు కదిలిన అధికారగణం 

 
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మి కి ఛార్జ్ మెమో జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి మురళి తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులు సుమారు 24 లక్షల రూపాయలు దుర్వినియోగం అయినట్లు ఆ గ్రామ వార్డు సభ్యులు ప్రజావాణిలో నేరుగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జడ్పీ సీఈఓ చందర్ నాయక్ విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో కార్యదర్శికి ఛార్జ్ మెమో ఇచ్చినట్లు డీపీవో మురళి తెలిపారు. ప్రస్తుతం పెద్దమల్లారెడ్డి పంచాయతీ నిధులకు సంబందించిన చెక్కులపై ఎంపీవో సంతకం ఉంటుందని చెప్పారు. ఇదిలావుండగా నిధుల దుర్వినియోగం సంబందించిన వ్యవహారంలో పంచాయతీ శాఖలో ఒక అధికారి తెర వెనుక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. మొదటి నుండి ఆ శాఖలో అన్నీ తానై నడిపిస్తున్నట్లుగా చెప్పుకొని కార్యదర్శులను వెనకేసుకొస్తున్న సదరు అధికారి ఇప్పుడు ఛార్జ్ మెమోపై తనదైన శైలిలో తెర వెనుక సహాయం అందిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తు న్నాయి. ఈ విషయం గ్రామంలో గుప్పుమనడంతో నిధుల విషయమై జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News