ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇన్‌చార్జ్ కలెక్టర్, పోలీస్ కమిషనర్

ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇన్‌చార్జ్ కలెక్టర్, పోలీస్ కమిషనర్

నిజామాబాద్ :నిజామాబాద్‌లో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను నిజామాబాద్ ఇన్‌చార్జ్ కలెక్టర్ భవేష్ మిశ్రా,  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, .పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో వేదిక , బారికేడింగ్ , అతిథుల కూర్చునే ఏర్పాట్లు , పార్కింగ్ , ట్రాఫిక్ నియంత్రణ , భద్రతా చర్యలు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు , అధికారులు , ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆగస్టు 15న నిర్వహించనున్న కార్యక్రమం విజయవంతంగా , ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)  భుజంగ రావు  , ఎ.ఆర్ ఏసిపి శ్రీ శ్రీరాములు ,  మున్సిపల్ కమిషనర్ శ్రీ దిలీప్ కుమార్ ,  నిజామాబాద్ ఏసిపి శ్రీ ప్రకాష్  , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి  , సి.ఐలు  , ఆర్.ఐ లు  మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News