అభివృద్ధి పనుల ను ప్రారంభించిన పోచారం.
- కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభించిన పోచారం..
- 70 లక్షల వ్యయంతో నిర్మించిన మెటల్ రోడ్డును లో లెవెల్ వంతలను ప్రారంభించిన ఎమ్మెల్యే..
- 25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన పోచారం..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం,బాన్సువాడ నియోజకవర్గం చందూర్ మండలం లోని మేడిపల్లి తండా, లక్ష్మీ సాగర్ తండా గ్రామాల లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కు ముఖ్య అతిథి గా హాజరై తన చేతుల మీదు గా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. మేడిపల్లి గ్రామం లో రూ.25 లక్షల వ్యయం తో నూతనం గా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మేడిపల్లి నుండి లక్ష్మి సాగర్ వరకు ఎస్ డి ఎఫ్ నిధులు రూ.1 కోటి వ్యయం తో నిర్మించిన సీసీ రోడ్డు ను ప్రారంభించారు. లక్ష్మి సాగర్ నుండి వ్యవసాయ పంట పొలాలకు ఎస్ డి ఎఫ్ నిధులు రూ. 70 లక్షల వ్యయంతో నిర్మించిన మెటల్ రోడ్డును, లో లెవెల్ వంతెన ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో చందూరు మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Views: 32
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Aug 2026 17:43:36
లింగాల గణపురం (జనగాం)కుందారం: కుందారం గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా సేవలందించిన పాలమాకుల ఐలయ్య ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థీవ...
