అంగరంగ వైభవంగా కొమురవెల్లిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
కొమురవెల్లి (సిద్దిపేట) కొమురవెల్లి మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కొమురవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి గ్రామ సర్పంచ్ గొల్లపల్లి పద్మ ఆంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించి, గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొమురవెల్లి పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి వారి దేవస్థానం పరిధిలో టీటీడీ కల్యాణ మండపంలో ఆలయ కార్యనిర్వాహన అధికారి జెండా ఆవిష్కరణ చేశారు. ఆలయ అర్చకులు గ్రామ ప్రజలు, స్వామి వారి భక్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజ చేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో MPDO, MPO, కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు గీస బిక్షపతి, గ్రామ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పాత్రికేయ మిత్రులు, గ్రామపంచాయతీ సిబ్బంది, యువకులు, మహిళలు, కొమురవెల్లి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అర్చక బృందం, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు, గ్రామ ప్రజలు కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 14:09:55
స్వాతంత్ర్య వేడుకల్లో ప్రతిభకు ఘన సత్కారం
దేశభక్తి స్ఫూర్తితో.. విద్యార్థుల భవిష్యత్తుకు బాట
ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం.. సంతోష్ యాదవ్ ప్రత్యేక చొరవ
