రోడ్ల విస్తరణపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
అభివృద్ధి పనులకు సహకరిస్తాం: సింగరేణి జీఎం
బెల్లంపల్లి మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేసేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రోడ్ల విస్తరణకు ఎదురవుతున్న అడ్డంకులు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సబ్‌కలెక్టర్ మనోజ్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, ఏజీఎం సంతోష్‌కుమార్, ఏసీపీ కిరణ్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, కమిషనర్ తన్నీరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ల విస్తరణలో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న సింగరేణి విద్యుత్ స్తంభాలను తొలగించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ సింగరేణి జీఎం రాధాకృష్ణను కోరారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం, గోల్‌బంగ్లా బస్తీ ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాలను జీఎంతో కలిసి పరిశీలించారు. అలాగే మార్కెట్ ఏరియాలో బంకర్ పక్కన ఉన్న స్థలాన్ని పట్టణ అభివృద్ధి అవసరాలకు కేటాయించి సహకరించాలని చైర్‌పర్సన్ కోరారు. దీనిపై జీఎం సానుకూలంగా స్పందించి పట్టణ అభివృద్ధి పనులకు సంస్థ తరఫున సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ, ఏజీఎం సంతోష్‌కుమార్‌కు చైర్‌పర్సన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్, సింగరేణి అధికారులు, సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Views: 34
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Aug 2026 17:43:36
లింగాల గణపురం (జనగాం)కుందారం: కుందారం గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా సేవలందించిన పాలమాకుల ఐలయ్య ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థీవ...
