ఎచ్ ఐ వి/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమాలపై సమీక్ష

ఎచ్ ఐ వి/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమాలపై సమీక్ష

హన్మకొండ  : వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి గారి మరియు హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అప్పయ్య  అధ్యక్షతన, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ యూనిట్, ఎ ఆర్ టి మెడికల్ ఆఫీసర్లు, ఐ సి టి సి కౌన్సిలర్లు, ఎన్ జి ఓ ప్రతినిధులు మరియు సంబంధిత సిబ్బందితో ఎచ్ ఐ వి/ ఎయిడ్స్  కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎచ్ ఐ వి/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఎచ్ ఐ వి పాజిటివ్‌గా గుర్తించబడిన ప్రతి కేసును తప్పనిసరిగా రికార్డుల్లో నమోదు చేసి, నివేదికల్లో చూపించడంతో పాటు, సంబంధిత వ్యక్తులకు అవసరమైన ఎ ఆర్ టి, కౌన్సిలింగ్, వైద్య మరియు ఇతర ఆరోగ్య సేవలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అదేవిధంగా, హై రిస్క్ గ్రూప్  వ్యక్తులను గుర్తించి, వారు తప్పనిసరిగా ఎచ్ ఐ వి స్క్రీనింగ్ చేయించుకునేలా ప్రేరేపించాలని, సంబంధిత ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎచ్ ఐ వి వ్యాప్తి నివారణకు ముందస్తు గుర్తింపు, కౌన్సిలింగ్, చికిత్స మరియు నిరంతర ఫాలోఅప్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి కేసుకు సంబంధించిన సమాచారం మరియు అందిస్తున్న సేవలను సమగ్రంగా నమోదు చేసి, కార్యక్రమాల పనితీరును మెరుగుపరచేందుకు సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో డా. మధన్ మోహన్, నోడల్ అధికారి/ప్రోగ్రాం అధికారి, డా. అరుణ్ జోషి, ప్రోగ్రాం అధికారి, వరంగల్, స్వప్న మాధురి, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ యూనిట్, డేటా మేనేజర్ కమలాకర్, ఎ ఆర్ టి వైద్య అధికారులు, ఐ సి టి సి కౌన్సిలర్లు, ఎన్ జి ఓ ప్రతినిధులు, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ యూనిట్, సిబ్బంది మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
 
 
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News