అభివృద్ధి చేస్తే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు
డాక్టర్ కాళీ ప్రసాద్ విమర్శ
హనుమకొండ / పరకాల : నర్సంపేట ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసినట్లయితే రేవురి ప్రకాష్ రెడ్డి పరకాలకు ఎందుకు వచ్చినట్లని భారతీయ జనతా పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఖాళి ప్రసాద్ విమర్శించారు. శుక్రవారం పరకాల పట్టణంలోని బిజెపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తాను నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసినట్లుగా చెప్పుకోవడం సరైనది కాదన్నారు. నర్సంపేట ప్రజల మనసులను గెలిచినట్లయితే పరకాల ఎమ్మెల్యేగా గతంలో హనుమకొండ ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేసినట్లు అని ఆయన నిలదీశారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా నష్టపోయిన పరకాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఆలోచించి ముందుకు సాగాలని ఆయన పరకాల ఎమ్మెల్యే కు హితవు పలికారు. నిజాం కాలం నుండి పరకాల అభివృద్ధి చెందడంతో పాటు తన ఉనికిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేరును సంపాదించుకుందన్నారు. పరకాలకు మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటును చేయనట్లయితే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని పరకాల ప్రజలు క్షమించరన్నారు. నర్సంపేట భూపాలపల్లి జిల్లాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాలలో మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు నిర్మిస్తున్న పరకాలపై ఎమ్మెల్యేకు పట్టింపేదని ఆయన మండిపడ్డారు. వంద పడకల ఆసుపత్రిలో పనులు పూర్తిగా కాకుండా ప్రారంభించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ లను పరకాలకు తెచ్చే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న ఎమ్మెల్యే తీర్పు ఆయన మండిపడ్డారు. 2020లో జరిగే ఎన్నికలలో బిజెపి గెలిచిన అనంతరం పరకాలకు మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలను తెస్తానన్నారు. గత వారం రోజుల క్రితం ఆసుపత్రిని సందర్శించి పనులు పూర్తికాలేదని ప్రకటించిన ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి ఇంతలోనే ప్రారంభించడం ఏమిటని ఆయన నిలదీశారు. నెలరోజుల వ్యవధిలో బిజెపి ప్రతినిధి బృందం ఆసుపత్రిని సందర్శిస్తుందని అక్కడ వసతులు గనుక లేనట్లయితే బిజెపి ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పోరాటం చేయడం తప్పదన్నారు. పరకాలలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ధర్మారెడ్డి చేసిన శంకుస్థాపనలు తిరిగి చేస్తూ తను ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. పరకాల ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపనలు చేసి పనులు పూర్తిచేసిన ఏ పనైనా ఉందా అని ఆయన నిలదీశారు. అదేవిధంగా జిల్లాలో నష్టపోయిన పరకాలకు న్యాయం జరగాలంటే అమరుల జిల్లా కేంద్రంగా పరకాల ను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ , కాసం గురు ప్రసాద్ , బిజెపి ప్రధాన కార్యదర్శి ఆర్పి జయంతి లాల్ , హనుమకొండ జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు బెజ్జంకి పూర్ణ చారి , కుక్కల విజయకుమార్ పాలకుర్తి గోపి లతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 13
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Aug 2026 17:43:36
లింగాల గణపురం (జనగాం)కుందారం: కుందారం గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా సేవలందించిన పాలమాకుల ఐలయ్య ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థీవ...
