బట్వాన్ పల్లి ఏంఆర్‌పీఎస్ నూతన గ్రామ కమిటీ
బెల్లంపల్లి మంచిర్యాల :బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామపంచాయతీలో ఎంఆర్‌పీఎస్ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు, మంచిర్యాల జిల్లా ఇన్‌చార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ ఆదేశాల మేరకు బెల్లంపల్లి మండల ఇన్‌చార్జి కృష్ణపల్లి రాజలింగు ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పీఎస్ సీనియర్ నాయకుడు మిట్టపల్లి మల్లయ్య మాదిగ నూతన కమిటీ సభ్యులను అభినందించారు. మాదిగల హక్కుల సాధనతో పాటు గ్రామస్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. నూతన కమిటీ: గ్రామ అధ్యక్షుడిగా ఇడికిరాల దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులుగా ఆయిల రాజన్న, ఇడికిరాల రాజన్న, ప్రధాన కార్యదర్శిగా ఇడికిరాల రాజేష్, కార్యదర్శులుగా శ్రీనివాస్, వెంకటి, ఆర్గనైజర్ సెక్రటరీగా ఇడిగిరాల వినోద్‌కుమార్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మహేష్, మల్లేష్, శంకర్, భూమయ్య, బాపు, పోగుల రాజు, భీమయ్య, రమేష్, మున్నా, గౌరవ సలహాదారుగా ఇడికిరాల వెంకటిని నియమించారు. నూతన కమిటీ గ్రామంలో ఎంఆర్‌పీఎస్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు సంఘ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


