కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదు: ముఫీనా ఫాతిమా హమీద్

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదు: ముఫీనా ఫాతిమా హమీద్

హనుమకొండ : ​పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'కళ్యాణ లక్ష్మి' మరియు 'షాదీ ముబారక్' పథకాలను నిర్వీర్యం చేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ముఫీనా ఫాతిమా హమీద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ​గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వం తరఫున సరైన సమయంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం, చట్టసభల్లో ఎలాంటి చట్టం లేదా నిర్దిష్ట తీర్మానం చేయకపోవడాన్ని సాకుగా చూపుతూ ఈ పథకాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టమవుతోందని ఆమె ఆరోపించారు. ​కేసీఆర్ హయాంలో ₹1,00,016 (రూ. లక్షా పదహారు) సాయం అందిస్తుండటాన్ని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకాలకు అరకొర నిధులు కేటాయిస్తూ వస్తోందని విమర్శించారు. చివరకు ఈ అద్భుతమైన సంక్షేమ పథకాలకు పూర్తిగా స్వస్తి పలకాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ​"పేద వర్గాల ఆడబిడ్డల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని వెంటనే మార్చుకోవాలి. కోర్టులో తగిన కౌంటర్ దాఖలు చేసి, ఈ పథకాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రతి పేద బిడ్డకు రూ. లక్షా పదహారు ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. 
Views: 132

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News