6వ వార్డుకు ఎందుకీ శిక్ష?

6వ వార్డుకు ఎందుకీ శిక్ష?

  • కలెక్టర్‌ గారూ.. ఒక్కసారి మా గోసలు చూడండి
  • మున్సిపల్‌ అధికారుల తీరుపై 6వ వార్డు కౌన్సిలర్‌ సల్ల కృష్ణవేణి ఆగ్రహం
 

బెల్లంపల్లి మంచిర్యాల :  బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 6వ వార్డుపై మున్సిపల్‌ అధికారులు వివక్ష చూపుతున్నారని కౌన్సిలర్‌ సల్ల కృష్ణవేణి ఆరోపించారు. వార్డులో పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వార్డులో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని, డ్రైనేజీలు రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు ఇళ్లలోకి వస్తోందని తెలిపారు. దీంతో దోమలు, దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ స్వయంగా వార్డులో పర్యటించి సమస్యలను పరిశీలించినా పరిష్కారం మాత్రం కనిపించడం లేదన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం ఏఈ అఖిల్‌ను సంప్రదించగా.. ‘‘మీ వార్డులోకి మిషన్‌ రాదు.. పనులు చేయం. ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరికైనా చెప్పుకో’’ అని నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు కౌన్సిలర్‌ ఆరోపించారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఇలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. కలెక్టర్‌ స్పందించాలని కోరిన కౌన్సిలర్  మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని 6వ వార్డులోని పారిశుద్ధ్య, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కృష్ణవేణి కోరారు. 6వ వార్డు ప్రజలు కూడా మున్సిపల్‌ పరిధిలోనే ఉన్నారని, తమ వార్డును నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. వార్డు సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అధికారులు స్పందించకపోతేవార్డు ప్రజలతో కలిసి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట, అవసరమైతే నడిరోడ్డుపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News