చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోండి
- రవీంధర్ సింగ్‌పై బీజేపి ఫైర్యూ
- డిఎఫ్ అవినీతి ఆరోపణలపై డిప్యూటీ మేయర్ సునీల్ రావు మండిపాటు
కరీంనగర్, : కరీంనగర్, యు డి ఎఫ్ పథకం పేరుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై బీఆర్ఎస్ నాయకుడు రవీంధర్ సింగ్ ఆరోపణలు శోచనీయమని బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్యాదగిరి సునీల్ రావుమండిపడ్డారు.కరీంనగర్‌లోని ఎస్‌బీఎస్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎక్సెస్ టెండర్లలో 30 నుండి 40 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అనవసరపు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు180 కోట్లకు శాంక్షన్ - 137 కోట్లతోనే పనులుకరీంనగర్ నగర అభివృద్ధికి యూడిఎఫ్ పథకం కింద 180 కోట్లకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వస్తే, ఈసివి 137 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు 137 కోట్లతోనే జరుగుతుంటే అవినీతి ఎక్కడ జరిగిందని సూటిగా ప్రశ్నించారు. టెండర్లు నిర్వహించి, ఆమోదం తెలిపేది రాష్ట్ర ప్రభుత్వమేనని, మంత్రి బండి సంజయ్‌కు దీనితో సంబంధం లేదని తెలిపారు. రవీంధర్ సింగ్ చేసిన ఆరోపణలు బాధ్యతారహితమైనవని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారుబీఆర్ఎస్ హయాంలో 6 వేల కోట్ల టెండర్లుగత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఆ సమయంలో రవీంధర్ సింగ్ 5 సంవత్సరాలు మేయర్‌గా, 2 సంవత్సరాలు సివిల్ సప్లైస్ చైర్మన్‌గా పనిచేశారని గుర్తు చేశారు. అప్పుడు జరిగిన ఎక్సెస్ టెండర్లకు సమాధానం చెప్పాలని నిలదీశారు. అదే కంపెనీకి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 6 వేల కోట్ల రూపాయల టెండర్లు ఇచ్చిందని ఆరోపించారు. మిడ్ మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్, తోటపల్లి ప్రాజెక్టు, మల్లన్న సాగర్, భక్త రామదాసు ప్రాజెక్టు వంటివి అదే కంపెనీ కట్టిందని, అప్పుడు ఎక్సెస్ టెండర్లపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.కరీంనగర్‌లో 546 కోట్లతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్‌లో 4 శాతం ఎక్సెస్ ఉందని, అది ఏ ప్రభుత్వ హయాంలో వచ్చిందని నిలదీశారు. చెక్ డ్యాంలు, ఇతర ప్రాజెక్టులన్నీ ఎక్సెస్‌లోనే జరిగాయని, వాటికి రవీంధర్ సింగ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌పై బురద చల్లడం ఆపండి. ఎమ్మెల్సీ అవకాశం రాలేదనే కక్షతో రవీంధర్ సింగ్ తన పార్టీపైనే ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కుమార్‌కు చౌకబారు ఆలోచనలు లేవని, స్మార్ట్ సిటీ పై ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారుకరీంనగర్‌ను యూడిఎఫ్ పథకంలో చేర్పించి 840 కోట్ల నిధులు తెచ్చిన ఘనత బండి సంజయ్‌దేనని తెలిపారు. మా నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు వొంటెల సత్యనారాయణ రెడ్డి, వంగల పవన్, బండారి వేణు, కొలిపాక శ్రీనివాస్, పొన్నం మొండయ్య, బీజేపి నాయకులు పండుగ నాగరాజు, వాసు, భాస్కర్, హమీద్, రాజ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
