అక్రమంగా నిల్వ ఉంచిన 5 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత ఒకరు అరెస్ట్.
భూపాలపల్లి / ఘనపూర్ : భూపాలపల్లి జిల్లా ఘనపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5 క్వింటాళ్ల పి.డి.ఎస్ బియ్యాన్ని సీ.సీ.ఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకు న్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీ.సీ.ఎస్ బృందం తనిఖీలు చేపట్టగా, రవినగర్, గ్రామానికి చెందిన తుర్పాటి రాజశేఖర్ (30) అక్రమంగా పి.డి.ఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. దీంతో అతని వద్ద ఉన్న సుమారు 5 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు తుర్పాటి రాజశేఖర్‌ను, స్వాధీనం చేసుకున్న పి.డి.ఎస్ బియ్యాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఘనపురం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పి.డి.ఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Views: 19
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Aug 2026 17:43:36
లింగాల గణపురం (జనగాం)కుందారం: కుందారం గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా సేవలందించిన పాలమాకుల ఐలయ్య ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థీవ...
