2వ వార్డు అంగన్వాడిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

2వ వార్డు అంగన్వాడిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బెల్లంపల్లి మంచిర్యాల: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా 2వ వార్డు అంగ న్వాడి పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి 2వ వార్డు కౌన్సిలర్ నిచ్చకోల వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ చిన్నారులకు దేశభక్తి, జాతీయ ఐక్యత ప్రాధాన్యతను వివరించారు.ఈ సందర్భంగా అంగన్వాడి చిన్నారులకు కౌన్సిలర్ వంశీకృష్ణ స్వయంగా పలకలు (స్లేట్లు) పంపిణీ చేశారు. “చదువే నిజమైన స్వాతంత్ర్యం. చిన్నతనం నుంచే పిల్లలకు మంచి విద్యతో పాటు సంస్కా రం అందించాలి” అని ఆయన అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News