పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి
గజ్వేల్ ఏసీపీ నర్సింలు
దౌల్తాబాద్, సిద్దిపేట: పోలీసు సేవలు ప్రజలకు చేరువయ్యేలా సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని గజ్వేల్ ఏసీపీ కె. నర్సింలు సూచించారు. శుక్రవారం వార్షిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా తోగుట పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన, స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, కేసు ప్రాపర్టీ, వాహనాల నిర్వహణను పరిశీలించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం సైబర్ క్రైమ్, సీసీటీఎన్ఎస్ తదితర విభాగాల పనితీరును సమీక్షించారు. కార్యక్రమంలో సీఐ లతీఫ్, ఎస్ఐ నవీన్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


