40 ఏళ్ల సినీ ప్రస్థానానికి ఘన నివాళి

40 ఏళ్ల సినీ ప్రస్థానానికి ఘన నివాళి

  • రక్తదానంతో అభిమానుల ప్రేమను చాటిన వెంకటేష్ ఫ్యాన్స్
  • రక్తదాన శిబిరాన్ని సందర్శించిన నిర్మాత సురేష్ బాబు..
  • అభిమానుల సేవా స్ఫూర్తిని అభినందించిన ప్రముఖ నిర్మాత

హైదరాబాద్,: విక్టరీ వెంకటేష్ గారి 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో విజన్ ఆంధ్ర ఆధ్వర్యంలో అభిమానుల భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. వెంకటేష్ సినీ రంగంలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ అభిమాన హీరోకు ఘనమైన కానుకగా రక్తదానం చేస్తూ సామాజిక సేవలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు గారు రక్తదాన శిబిరాన్ని సందర్శించి, రక్తదానం చేస్తున్న అభిమానులను అభినందించారు. అభిమానులు వెంకటేష్‌పై చూపిస్తున్న ప్రేమ, అభిమానం సేవా కార్యక్రమాల రూపంలో వ్యక్తం చేయడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్న విక్టరీ వెంకటేష్‌కు అభిమానుల ప్రేమకు ప్రతీకగా ఈ భారీ రక్తదాన శిబిరం నిలిచింది. సినీ వేడుకను సామాజిక సేవతో మేళవించి నిర్వహించిన ఈ కార్యక్రమం అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.  
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News