బెల్లంపల్లి లో ఘనంగా  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

బెల్లంపల్లి లో ఘనంగా  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

బెల్లంపల్లి మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ దావ స్వాతి తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలోనూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రత్నం సుకుమారి, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి ప్రభాకర్ యాదవ్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News