అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు

అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు

  • జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కరీంనగర్, : రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకం ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య సమర యోధులను సన్మానించి, ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజా పాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని, కరీంనగర్ జిల్లా పథకాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. మహాలక్ష్మి: 9 డిసెంబర్ 2023న ప్రారంభమైన ఉచిత బస్సు పథకంలో ఇప్పటివరకు 8 కోట్ల 3 లక్షల ప్రయాణాలు, 366 కోట్ల 31 లక్షల లబ్ధి.  గ్యాస్ సిలిండర్: 1 లక్ష 58 వేల మందికి 9 లక్షల 23 వేల 755 సిలిండర్లు 500 రూపాయలకు, 29 కోట్ల 78 లక్షల సబ్సిడీ. గృహజ్యోతి: 200 యూనిట్లలోపు 1 లక్ష 71 వేల 622 సర్వీసులకు జీరో బిల్లు, 182 కోట్ల 30 లక్షలు చెల్లింపు. రైతు భరోసా: 1 లక్ష 92 వేల 628 మంది రైతులకు 206 కోట్ల 82 లక్షలు. సన్న ధాన్యం బోనస్ 28 వేల 659 మందికి 71 కోట్ల 17 లక్షలు. ఇందిరమ్మ ఇండ్లు:మొదటి విడత 10 వేల 506, 8 వేల 557 నిర్మాణంలో, 222 కోట్లు విడుదల. రెండవ విడతలో ప్రతి నియోజకవర్గానికి 1500. పైకప్పు మార్పుకు ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 2 లక్షల చొప్పున. పింఛన్లు:1 లక్ష 32 వేల 229 మందికి నెలకు 30 కోట్ల 60 లక్షలు. కొత్త పింఛన్లకు ప్రత్యేక చర్యలు. రేషన్:47 వేల 138 కొత్త కార్డులు, 97 వేల 13 మంది నమోదు. 3 లక్షల 22 వేల 198 కుటుంబాలకు నెలకు 6063 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం. స్మార్ట్ కార్డుల ప్రక్రియ ప్రారంభం. ఆరోగ్య శ్రీ:జనవరి నుండి 14 వేల 932 మందికి ఉచిత శస్త్ర చికిత్సలు, 42 కోట్ల 75 లక్షలు చెల్లింపు. మహిళా శక్తి:93 యూనిట్లకు 2 కోట్ల 65 లక్షలు. 175 సంఘాలకు 26 కోట్లు, 1706 సంఘాలకు 165 కోట్ల 74 లక్షల బ్యాంకు లింకేజీ. 1 లక్ష 46 వేల 610 మంది మహిళలకు చీరల పంపిణీ. 374 సంఘాలకు స్వంత భవనాల అనుమతి. కరీంనగర్ అర్బన్, గంగాధరలో పెట్రోల్ పంపుల ఏర్పాటు. ప్రజా పాలన:99 రోజుల్లో 4290 పెండింగ్ ఫైళ్లు పరిష్కారం. 318 గ్రామపంచాయతీల్లో రోడ్డు భద్రత కమిటీలు. అన్ని గ్రామాల్లో 15 రోజుల పారిశుద్ధ్యం. కోనేరుపల్లి, వెలిచాల ప్లాస్టిక్ రహిత గ్రామాలు. సర్పంచులకు హెల్ప్ లైన్. ప్రజావాణి: జూన్ నుండి డివిజన్ స్థాయిలో, 17 నుండి మండల స్థాయిలో ప్రారంభం. భూభారతి: మొదటి దశలో 70 గ్రామాల గుర్తింపు, 7 గ్రామాల్లో రీసర్వే. భూదార్ నెంబర్ల కేటాయింపు. శ్రీపాద ఎల్లంపల్లి, గౌరవెల్లి భూసేకరణ వేగం. వ్యవసాయం: ఎల్ నినో నేపథ్యంలో ఆరుతడి పంటల ప్రోత్సాహం. గత ఏడాది 6130 ఎకరాలు, ఈ వానాకాలం 19135 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు. 39277 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 22714 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటు. 2 కోట్ల 20 లక్షల చేప పిల్లల విడుదల, 16 వేల మంది మత్స్యకారులకు లబ్ధి. ధాన్యం: గత యాసంగిలో 319 కేంద్రాలు, 3 లక్షల 38 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు. 142346 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం. ఉపాధి హామీ: 51517 కుటుంబాలకు 17 లక్షల పని దినాలు, 41 కోట్ల 20 లక్షల వేతనం. ఆరోగ్యం:చొప్పదండిలో 37 కోట్లతో 100 పడకల ఆసుపత్రి సిద్ధం. మానకొండూరులో 17.5 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం. కొత్తపల్లిలో 15 కోట్లతో ఆయుష్ ఆసుపత్రి. కొత్తపల్లి మెడికల్ కళాశాలలో 26 కోట్లతో నర్సింగ్ కళాశాల. 2 కోట్ల 98 లక్షల సిఎస్ఆర్ నిధులతో అంబులెన్స్, మిషన్లు. విద్య: చొప్పదండి, మానకొండూరులో యంగ్ ఇండియా స్కూల్స్. 7 మంది ఉపాధ్యాయుల విదేశీ శిక్షణ. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కిచెన్ కు స్థలం. ఉల్లాస్ ద్వారా 5351 మంది అక్షరాస్యులు, రాష్ట్రంలో కరీంనగర్ మొదటి స్థానం. 83 పూర్వ ప్రాథమిక పాఠశాలలు, 16 భవిత కేంద్రాలు. సంక్షేమం: మైనారిటీ గురుకులాల్లో 3822 మంది. ఎస్సీ వసతి గృహాల్లో 2214 మంది, 100 శాతం ఉత్తీర్ణత. ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా 238 మందికి ఉద్యోగాలు. బీసీ విద్యార్థులకు 17996 మందికి 22 కోట్ల 82 లక్షల ఉపకార వేతనం. గిరిజన విద్యా నిధికి 50 లక్షలు. 1518 సంక్షేమ సంస్థలకు నెలకు 395 టన్నుల సన్న బియ్యం. 777 అంగన్వాడీల ద్వారా 7579 గర్భిణులు, 42909 మంది పిల్లలకు పోషకాహారం. 60 అంగన్వాడీ టీచర్ పోస్టుల నోటిఫికేషన్. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 151 మంది బాల కార్మికుల విముక్తి. దివ్యాంగులు, వృద్ధులు: మండల, జిల్లా కమిటీలు. 132 సహాయ ఉపకరణాలు, 17 జంటలకు ప్రోత్సాహకం. ట్రాన్స్ జెండర్లకు మైత్రి క్లినిక్. మున్సిపల్: 840 కోట్ల యుసిఎఫ్, 50 కోట్ల యుఐడిఎఫ్ నిధులతో పనులు. 158 కోట్ల సాధారణ నిధులతో సిసి రోడ్లు, డ్రైన్, పైప్ లైన్. జనగణన: మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా పూర్తి. ఫిబ్రవరిలో జనగణన. ఓటర్ సవరణలో 100 శాతం ఫారాల పంపిణీ, 83.74 శాతం డిజిటలైజేషన్. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కి, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, జర్నలిస్టులు, జిల్లా ప్రజలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News