రాత్రి ఒకటైన బార్& రెస్టారెంట్లు బందు పెట్టరా
బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి,, పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో బార్ అండ్ రెస్టారెంట్లు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి ఒకటైన మద్యం అమ్ముతున్న పరిస్థితులు ఉన్నాయని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ రవీందర్ గౌడ్ ఆరోపించారు.ఈ సందర్బంగా హుస్నాబాద్ మండలంతో పాటు కొన్ని చుట్టుపక్కల మండల గ్రామాలలో బార్ మరియు రెస్టారెంట్ లలో నుంచి నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా చేయడం జరుగుతుందన్నారు.కొంతమంది బార్ యజమానులు వారి సిబ్బందితో స్వయంగా బెల్టు షాపులకు సప్లై చేయడం జరుగుతుందని, బెల్ట్ షాపులకు మద్యం సప్లై చేస్తున్న బార్లను సీజ్ చేయవలసి ఉన్న ఎందుకు పట్టించుకోవట్లేదని బిఎస్పి పార్టీ పక్షాన ప్రశ్నించారు.ఇక చికెన్ మటన్ వివిధ ఆహార పదార్థాలకు సంబంధించి కల్తీ విషయములో ఇప్పటికే సార్లు బార్ అండ్ రెస్టారెంట్ లో కేసులు నమోదు కావడం జరిగిందని, అయినా నాణ్యత విషయంలో మార్పులు రాలేదన్నారు.కొన్ని బార్లలో ఫుల్ బాటిలలో వాటర్ కలిపి అమ్ముతున్నట్లు అదే విధంగా కొన్ని విలువైన బాటిళ్లలో చీఫ్ లిక్కర్ కలిపి అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.ప్రొద్దున 10 గంటలకు తీయవలసిన బార్లు కొన్ని తొమ్మిది గంటలకే ఓపెన్ చేస్తున్నారని,బెల్టు షాపుల కంటే అద్వానంగా హుస్నాబాద్బార్ అండ్ రెస్టారెంట్ మారాయన్నారు.ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయమని,మద్యం మత్తులో దొంగతనాలు, యాక్సిడెంట్లు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉన్న కఠిన చర్యలు తీసుకోవడంలో ఎక్సైజ్ శాఖ వెనుకడుగు వేయడం జరుగుతుందన్నారు.బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో చర్యలు తీసుకోకపోతే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు బీఎస్పీ పార్టీ పక్షాన ధర్నా కార్యక్రమం చేపడతా మని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల రాజు, రాంబాబు, మారేపల్లి సుధాకర్ ఎలగందుల శంకర్ తదితరులు పాల్గొన్నారు
Views: 57
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Aug 2026 17:43:36
లింగాల గణపురం (జనగాం)కుందారం: కుందారం గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా సేవలందించిన పాలమాకుల ఐలయ్య ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థీవ...
