ఉట్నూర్‌లో ఆత్రం వంశీయుల చారిత్రక కోటపై జాతీయ జెండా ఆవిష్కరణ
ఉట్నూర్, : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉట్నూర్‌లోని చారిత్రక ఆత్రం వంశీయుల రాజుల కోట వద్ద జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఐటీడీఏ ఏపివో ఆత్రం భాస్కర్ జెండాను ఆవిష్కరించగా, డిప్యూటీ డిఈఓ గోడం చందన్ ఆధ్వర్యంలో జాతీయ గీతాన్ని ఆలపించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ కోటను మరింత అభివృద్ధి చేసి పర్యాటక, చారిత్రక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సతీమణి వెడ్మ దృపత, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్కా బాపూరావు, మెస్రం దుర్గు సర్మీడి, తొడసం దేవరావు, తొడసం అమృత్ రావు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు పెందోర్ దాదిరావు, మార్సుకోలా తిరుపతి, సర్మీడి కొట్నాక దేవుసావ్, కుంరం జైతు, ఆడ భీంరావుతో పాటు పలువురు ఆదివాసీ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ఆత్రం వంశీయుల చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ కోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం పట్ల ఆదివాసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 14:09:55
స్వాతంత్ర్య వేడుకల్లో ప్రతిభకు ఘన సత్కారం
దేశభక్తి స్ఫూర్తితో.. విద్యార్థుల భవిష్యత్తుకు బాట
ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం.. సంతోష్ యాదవ్ ప్రత్యేక చొరవ
