ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆర్టీవో కార్యాలయాన్ని ముట్టడించిన ఏఐటీయూసీ నాయకులు
కొత్తగూడె : ఆటో డ్రైవర్లపై అమలవుతున్న వివిధ నిబంధనలను సవరించి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల జములయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కొత్తగూడెం ఆర్టీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన ముట్టడి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆటోలపై స్టిక్కర్ విధానాన్ని రద్దు చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించి జారీ చేసిన చలానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో ఫిట్‌నెస్‌పై పెంచిన చలానా రుసుములను తగ్గించాలని కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆటో లైసెన్స్ విధానాన్ని రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న విధంగా త్రీ వీలర్ ఆటో లైసెన్స్‌లను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ, టౌన్ అధ్యక్షుడు అబ్బులు, కార్యదర్శి దేశాయ్, వివిధ ఆటో స్టాండ్‌ల అధ్యక్షులు, కార్యదర్శులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
Views: 16
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
