అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

నాగర్ కర్నూల్ : బిజినపల్లి  పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్&సైన్స్ కలశాల(స్వయంప్రతిపత్తి),పాలెంలో 2026–27విద్యా సంవత్సరానికి డెయిరీ సైన్స్ విభాగంలో అతిథి అధ్యాపకుల(Guest Faculty)నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రాములు ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన విద్యార్హతల ధృవపత్రాలు,మార్కుల మెమోలు,అనుభవ పత్రాలు మరియు ఇతర సంబంధిత పత్రాలతో కలిసి జూలై,29,2026 సాయంత్రం 5.00గంటలలోపు కళాశాల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.ఇంటర్వ్యూ జూలై 30, 2026 ఉదయం 11.00గంటలకు కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో నిర్వహించబడుతుందని తెలిపారు.సంబంధిత సబ్జెక్టులో పీజీ (PG)లో జనరల్ అభ్యర్థులు కనీసం 55 శాతం,ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్నారు.సంబంధిత సబ్జెక్టులోPh.D./NET/SLET/SET అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని,అలాంటి అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో సంబంధిత సబ్జెక్టులో పీజీ అర్హత కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు అదనపు వెయిటేజ్ ఇవ్వబడుతుందని తెలిపారు.అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రాములు కోరారు. 
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ